ఐదేళ్లుగా మూతపడ్డ వాటర్ ప్లాంట్లు
28-03-2026 12:08 AM
తాగునీటి కోసం అంబేద్కర్ నగర్ ప్రజల ఆవేదన
సత్తుపల్లి మార్చి 27 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ పాత సెంటర్ వద్ద సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లు అధికారుల నిర్లక్ష్యానికి గురై ఐదేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ ప్లాంట్లు ప్రారంభించకపోవడంతో ప్రజలకు తాగునీటి సమస్య నెలకొంది. ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడం స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వాటర్ ప్లాంట్లను ప్రారంభించి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.




