2 August, 2026 | 2:45 AM

గోదావరి-కృష్ణా బేసిన్లకు జల కళ

02-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి) : గోదావరి, కృష్ణా బేసిన్లలో ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో రెండు బేసిన్లలోని ప్రాజెక్టుల నీటిమట్టాలు క్రమంగా పెరుగుతుండగా, జలాశయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

గోదావరి బేసిన్‌లో సింగూర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల్లో నిల్వలు పెరుగుతుండగా, మేడిగడ్డ, తుప్పాకులగూడెం, దుమ్ముగూడెం బ్యారేజీల ద్వారా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్‌లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు గణనీయమైన ఇన్ఫ్లో నమోదవుతుండగా, ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా నీటి విడుదల కొనసాగుతోంది. 

ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి నిల్వలు