తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపికైన వార్డ్ ఆఫీసర్ రాజు బాబు
మేడ్చల్ అర్బన్ మార్చి 16(విజయక్రాంతి): తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న రాజు బాబు ఎంపికైనారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు రాజబొల్లారం పట్టణానికి చెందిన పిల్లి బిక్షపతి జయమ్మ దంపతుల కుమారుడు పిల్లి రాజు బాబు తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపిక అయ్యారు.
ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్ లో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా రాజబొల్లారం పట్టణానికి పేరు తీసుకు వచ్చిన పిల్లి రాజు బాబును పట్టణ ప్రజలు నాయకులు అభినందించారు.
ప్రస్తుతం రాజు బాబు సీఎంసీ లో కుత్బుల్లాపూర్ జోన్ లోనీ మేడ్చల్ సర్కిల్ 60 లో వార్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న విషయం విధితమే.ఈ సందర్భంగా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపికైన రాజు బాబు మాట్లాడుతూ వాలీబాల్ క్రీడలో తన నైపుణ్యాన్ని వెలికి తీసి మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణానికి,రాజబొల్లారం పట్టణానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.




