19 April, 2026 | 5:58 AM

మహిళా కోటా బిల్లుపై మాటల యుద్ధం

19-04-2026 12:29 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౮: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అధికార, విపపక్షాల మధ్య శనివారం దేశవ్యాప్తంగా వాగ్యుద్ధం జరిగింది. మహిళా సాధికారతకు బాటలు వేసే చారిత్రక బిల్లును అడ్డుకున్నారంటూ అధికార పక్షం విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇండియా కూటమి మహిళా వ్యతిరేక వైఖరి వల్లే బిల్లు వీగిపోయిందని ఆరోపించింది.

మరోవైపు, బిల్లు వీగిపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు గట్టిగా చెబుతున్నాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) సాకుతో మహిళలను మోసం చేయాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తున్నదని ఆరోపిస్తున్నాయి. డీలిమిటేషన్‌ను మహిళా కోటా బిల్లుతో ముడిపెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.