18 June, 2026 | 6:03 PM

ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను, నల్ల బిల్లు మాఫీ

18-06-2026 04:52 PM

నిజాంసాగర్ జూన్ 18( విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించే తల్లిదండ్రుల యొక్క ఇంటి పన్ను నల్లబిల్లలను ఈ సంవత్సరం నుండి పూర్తిగా మాఫీ చేస్తానని  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగళూరుగ్రామ సర్పంచ్ నర్మల రాజు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా ప్రోత్సహించడానికి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నాను అన్నారు.కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి రమ్య శ్రీ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.