18 June, 2026 | 7:18 PM

రైతు తో పాటు అరకదున్నిన ఎమ్మెల్యే సామేలు

18-06-2026 05:41 PM

రైతే దేశానికి వెన్నెముక.. రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం లో ములుక శీర ఎరువ్వక సందర్బంగా గురువారం  దేశానికి వెన్నెముక రైతు, రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని, వ్యవసాయం అంటే పదిమందికి సహాయం, తలచి తుంగతుర్తి లో విత్తనాలు వేసే రైతు తో పాటు అరక దున్నీన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, తన స్థాయిని కూడా మరిచి, రైతుతో నవ్వుకుంటూ, ఎద్దులను ఆడిస్తూ, ముందుకు సాగడం, ఒక పక్క రాజకీయ నాయకులు, మరొక ప్రక్క రైతుతో సందడి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు కల్పిస్తున్న ఉచిత పెసల్లు, కందులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు.