18 June, 2026 | 7:19 PM

ఘనంగా కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ జన్మదిన వేడుకలు

18-06-2026 05:53 PM

బాన్సువాడ, జూన్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ కౌన్సిలర్ ల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా మొహమ్మద్ గౌస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి గౌస్ కు కౌన్సిలర్లు అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత తెలంగాణ ఉద్యమంలో టీచర్స్ కాలనీ 13 వ వార్డు నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పోరాటం చేయడం జరిగిందని తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలకు అధ్యక్షతన వహించి కీలక పాత్ర పోషించిన నాయకుడు గౌస్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖలేఖ్,లింగం,అబ్దుల్ హకీమ్,డి.శ్యామల వెంకటేష్ నాయకులు.తదితరులు పాల్గొన్నారు.