18 June, 2026 | 7:19 PM

ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఫార్మసీ డిగ్రీ చదివే సువర్ణావకాశం

18-06-2026 04:53 PM

పెద్దపల్లి, జూన్ 18(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ఎంపిసి, బైపిసి, గ్రూపులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన ఉపాధి  విద్యావకాశం అందుబాటులోకి వచ్చిందని,

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ 'గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్' వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు 3 నెలల ప్రత్యేక శిక్షణను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కాలంలో ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 15,000 స్టైపండ్ అందించడంతో పాటు, వసతి సౌకర్యాన్ని కూడా ఉచితంగా కల్పిస్తారు.

శిక్షణ అనంతరం, టాటా ఇన్‌స్టిట్యూట్  సంస్థలో ఫార్మసీ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసే వరకు ప్రతి సెమిస్టర్‌కు రూ. 30,000 ఫీజును సంస్థే భరిస్తుంది. అంతేకాకుండా, విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంతో పాటు, కోర్సు పూర్తికాగానే ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కోరారు. పూర్తి వివరాల కోసం ఈ నెల 20వ తేదీ లోపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన  మేడం ను స్వయంగా కలిసి సంప్రదించగలరు.