4 May, 2026 | 7:22 PM

ఆసుపత్రిలో నిరీక్షణాలయం ప్రారంభం

04-05-2026 06:16 PM

పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్ పాల్వంచ వారి సహకారంతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో నిరీక్షణాలయంను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు సోమవారం ప్రారంభించారు. నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన పాల్వంచ ప్రభుత్వ వైద్య కేంద్రం నందు రోగుల, సహాయకుల నిరీక్షణాలయం నిర్మించడం అభినందనీయం అన్నారు. 

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా.సోమరాజు దొర మాట్లాడుతూ రోగులు పడుతున్న ఇబ్బందులను నవ లిమిటెడ్ దృష్టికి తీసుకువెళ్ళగా ఆసుపత్రికి రోగుల కొరకు నిరీక్షణాలయం ను ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్థించిన వెంటనే స్పందించి నిర్మించి నేడు అప్పగించినందుకు నవ మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ విద్య మరియు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంలో 'నవ లిమిటెడ్' ఎప్పుడు ముందు ఉంటుంది అని ప్రశంసించారు.