28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

నేల పరిరక్షణ మనందరి బాధ్యత: ఏఓ వాణి

04-05-2026 06:19 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని ఎనిమిది క్లస్టర్లలోని 8 రైతు వేదికలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవం ప్రారంభించడం జరిగింది. కూసుమంచి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నేల పరిరక్షణ, మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్ష ప్రాముఖ్యత , సమతుల ఎరువుల యాజమాన్యం, పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల కలిగే అనర్ధాలు, విత్తనాలు కొనుగోలులో జాగ్రత్తలు, బిటి 3 పత్తి విత్తనాల వల్ల కలిగే అనర్ధాలు , పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యత,  మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు.

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణి గారు రైతులందరూ వ్యవసాయశాఖ సూచనలు పాటించాలని , ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.టెక్నికల్ ఏవో అరుణ గారు వేసవి లోతు దుక్కుల ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం మట్టి పరీక్ష కొరకు నమూనాల సేకరణ విధానాన్ని చూపించారు. నేలను పరిరక్షించుకుంటామని, సాయి రైతులకు అవగాహన కల్పిస్తామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు.