సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వొడ్నాల రవీందర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలను సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగాయి, హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో 46 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగంచుకున్నారు. అధ్యక్ష స్థానానికి మేకల తిరుపతి రెడ్డి, వొడ్నాల రవీందర్ లు, ఉపాధ్యక్ష పదవికి ఆవుల శివకృష్ణ, మల్యాల కరుణాకర్ పోటీపడ్డారు. అధ్యక్షుడుగా వొడ్నాల రవీందర్ కి 24 ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడుగా ఆవుల శివకృష్ణ కు 24 ఓట్లతో విజయం సాధించారు.
ప్రధాన కార్యదర్శిగా ఆవునూరి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా గుడ్ల వెంకటేష్, కోశాధికారిగా చీకటి సంతోష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా వడ్లకొండ రవి కిరణ్, లైబ్రరీ కార్యదర్శిగా బొబ్బిలి శ్యాం, మహిళా ప్రతినిధిగా పి. సంధ్యారాణి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గూడూరి దివాకర్ రావు, ఆవుల లక్ష్మి రాజం, మాడూరి ఆంజనేయులు, డి, భూసారపు బాలకిషన్ ప్రసాద్, పదాల శ్రీరాములు, ఆకారపు సరోత్తం రెడ్డి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సామల రాజేంద్ర ప్రసాద్, ఆరెల్లి రాములు, వేముల స్నేహ, మాడూరి పృథ్వీ, పూజ, ఆకారపు రామకృష్ణారెడ్డిలను ఎన్నుకున్నారు.
పడాల అంజయ్య, రుద్రారపు నర్సయ్య లు ఎన్నికల అధికారుల పర్యవేక్షణ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఓడ్నాల రవీందర్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సుల్తానాబాద్ కు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గెలిచిన నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.




