30 March, 2026 | 10:10 PM

పెంచిన ఫీజులు తగ్గించాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన

30-03-2026 08:25 PM

సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ముందు నిరసన తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని  సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ లో అధికంగా ఫీజులు  పెంచారంటూ విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల ముందు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు  మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఫీజులు  పెంచడంతో అధికంగా భారం పెరుగుతుందని వాపోయారు. పాఠశాలలో జాయిన్ అయినప్పుడు ప్రతి సంవత్సరం రెండు శాతం నుంచి ఐదు శాతం మాత్రమే ఫీజు పెంచుతామని చెప్పి,

ఇప్పుడు ఏకంగా 15 నుండి 20 శాతం ఫీజులు పెంచడంతో విద్యార్థులను చదివించాలంటే ఎక్కువ భారం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తు నిరసన తెలిపారు. ఫీజు లేట్ గా కట్టడంతో ఫెనాల్టీ వేసి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాగే ప్రతి సంవత్సరం  యూనిఫామ్, స్కూల్ బుక్స్ మార్చడంతో తల్లిదండ్రులపై భారం మరింత  పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఫీజు తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.