30 March, 2026 | 9:36 PM

మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

30-03-2026 08:21 PM

* అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

* పోలీస్ స్టేషన్ కు తరలింపు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): మలిదిశ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా సోమవారం పోలీసులు ఉద్యమకారులను మాజీ సర్పంచ్లను ముందస్తు అరెస్టు చేశారు. సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు పిడమర్తి అంజి,మాజీ సర్పంచులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెనోపిస్టులో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, 25 వేల పెన్షన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇచ్చి ఉద్యమకారుల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని మాయ మాటలు చెప్పి ఉద్యమకారులను మోసం చేసిందని వారన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.