పదవీ విరమణ పొందనున్న సోలార్ ఎనర్జీ జీఎంని సన్మానించిన ఏరియా జీఎం
30-03-2026 08:35 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణిలో 38 సంవత్సరాల సుదీర్ఘ సేవలో భాగంగా,సోలార్ ప్రాజెక్టుల రూపకల్పన, అమలు విస్తరణలో కీలక పాత్ర పోషించారు. సంస్థలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో సీతారాం చేసిన కృషి,విశేషమైనదిగా అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ ఎం. శాలెం రాజు మాట్లాడుతూ, సీతారాం అంకితభావంతో కూడిన సేవలను కొనియాడారు. ఆయన ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ ఎం. శాలెం రాజు, ఏజీఎం (ఈ & ఎం) శ్రీ కే. సూర్యనారాయణ రాజు, (ఎస్.ఓ. టు జీఎం)శ్రీ కోటి రెడ్డి గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (వి.కే.సి.ఎం) శ్రీ ఎం.వి. నరసింహరావు , ఏజీఎం (పర్సనల్) శ్రీ జి.వి. మోహన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




