సమ్మె బాట పట్టిన విఓఏలు
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలలో ఇందిరా క్రాంతి పథకంలో విఓఏలు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమ్మె చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు .కనీస వేతనం 20000 రూపాయలు ఇవ్వాలని ఎస్సీఆర్పీ ఉద్యోగాలుగా గుర్తించాలని పేర్కొన్నారు. పదోన్నతి కల్పించాలని ఆరోగ్య భీమా 20 లక్షలుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. అందులో భాగంగానే మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా నిరవధికంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు .కార్యక్రమంలో వివోఏలు ఎన్ స్వామి ఎం శ్రీనివాస్ భీమ్రావు బి రవీందర్ కే రాజు బి లక్ష్మి ఎస్ నిరంజని ఏ దేవిదాస్ తదితరులు ఉన్నారు.






