26 April, 2026 | 11:45 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఆల్ ఇండియా పోలీస్ మీట్ కు ఎంపికైన వినీత్

29-11-2025 05:18 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): గుజరాత్ లోని రాజ్ కోట్ లో త్వరలో జరగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్ లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన హాకీ క్రీడాకారుడు మోటపోతుల వినీత్ ఎంపికయ్యాడు. డిసెంబర్ 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు గుజరాత్ రాజకోట్ లో జరుగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్ లో స్పెషల్ అర్మడ్ రిజర్వు(SARCPL) హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మోటపోతుల వినీత్ పోలీస్ టీం తరఫున హాకి ఆడనున్నాడు.

వినీత్ ఎంపిక కావడం పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, హాకీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి బొడిగె తిరుపతి, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, క్రీడాకారులు సాదుల శ్యామ్, సజ్జు, సాయి కృష్ణ, విక్రమ్, రాజేష్ కే రాజేష్, ఏం విక్రమ్, సాంబరాజు వంశీ, వినయ్, పరబ్రహ్మం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.