ప్రభుత్వ పాఠశాల వైపే గ్రామస్తుల మొగ్గు
బోథ్. ఆగస్టు 25 ( విజయక్రాంతి): మండలంలోని మంద బొగుడ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుండగా 25 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. గ్రామస్తుల ప్రైవేటు పాఠశాల వైపు దృష్టి సారించకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తున్నారు. ఉపాధ్యాయుని భరోసా మీ పిల్లలను చదువుల్లో ఉత్తములుగా తీర్చిదిద్దుతా. మీరు ప్రైవేట్ స్కూళ్లకు పంపించకండి. అంటూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో తమ పిల్లలను ఉపాధ్యాయుడు ఇచ్చిన భరోసాతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయుడు దయాకర్ సైతం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. కాగా గ్రామం నుండి కేవలం ముగ్గురు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఏది ఏమైనా గిరిజన గ్రామంలో తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థుల సంఖ్య నిలకడగా ఉంది.






