25 August, 2026 | 3:15 PM

మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

25-08-2026 02:10 PM

మల్లాపూర్ ఆగస్టు 25(విజయక్రాంతి): వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ‘ఆకు పచ్చ జగిత్యాల – ఆరోగ్యకరమైన జగిత్యాల’ కార్యక్రమాన్ని గొర్రెపల్లి గ్రామంలో నిర్వహించారు. ఇందులో భాగంగా మల్లాపూర్ రోడ్ ఫారెస్ట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏలేటి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మొక్కల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట రాజు కుమార్, వార్డు సభ్యులు రాజు, మహేష్, మాజీ సర్పంచ్ లింగాల భూమయ్య, పంచాయతీ కార్యదర్శి, ఎఫ్ఏ సత్తాన్న, పన్నుల రవి, బోయిని శేఖర్, బోడా నర్సయ్య, పతిపాక మల్లయ్య, బొక్కల శ్రీను, నరేష్ తదితరులు పాల్గొన్నారు.