calender_icon.png 21 February, 2026 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ భవనాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్

21-02-2026 07:22:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వెనక భాగంలో గల కొత్త మున్సిపల్ భవనాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమీషనర్ జగదీశ్వర్ గౌడ్, డీఈ హరిభువన్ తో కలిసి పరిశీలించారు. ప్రస్తుత మున్సిపల్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో కార్యాలయాన్ని నూతన భవనానికి తరలించాలని నిర్ణయించుకున్నారు. నూతన భవనంలో అవసరమైన మరమ్మతులపై, మార్పులపై సమీక్షించారు. వీరి వెంట కౌన్సిలర్ గోపు గోపి తదితరులు ఉన్నారు.