బ్యాడ్మింటన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన వేదితారెడ్డి
11-08-2026 12:00 AM
వరంగల్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన ‘యోనెక్స్ సన్రైజ్ 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అండర్ 13 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026’ లో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కట్కురి వేదిత రెడ్డి బాలికల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది.
సింగిల్స్ విభాగంలో నాలుగో స్థానం కూడా సాధించి, పంజాబ్లో జరగనున్న అఖిల భారత అండర్ 13 జాతీయ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. వేదిత రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోని వన్టర్ఫ్ అకాడమీలో కోచ్ నిఖిల్ కుమార్ దగ్గర ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ వరంగల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పి.రమేష్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు వేదిత రెడ్డిని అభినందించారు.






