8 August, 2026 | 7:59 PM

బోనం ఎత్తుకున్న వేదం పాఠశాల విద్యార్థులు

08-08-2026 03:29 PM

బోథ్. (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నెత్తిన బోనం ఎత్తుకొని పండుగ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు  వేప కొమ్మలు చేత పట్టుకొని బోనాల కుండలను తలపై పెట్టుకుని బోనాల వేడుకలను జరుపుకున్నారు. ఉపాధ్యాయులు సైతం పిల్లలతో కలిసి బోనాల పండుగ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యా యులు తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ ప్రత్యేకతను వివరించారు. బోనాల పండుగ గ్రామ దేవతలను సంతృప్తి పరిచేందుకు జరుపుకోవడం జరుగుతుందన్నారు.