8 August, 2026 | 8:53 PM

హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతం చేద్దాం

08-08-2026 07:49 PM

- చేవెళ్లలో సన్నాహక సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ కన్వీనర్ కటికె నందకిషోర్

చేవెళ్ల,(విజయక్రాంతి): భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కే. ఎస్.రత్నం హర్ ఘర్ తిరంగా యాత్ర అసెంబ్లీ కన్వీనర్ కటికె నందకిషోర్ తో కలిసి చేవెళ్ళ మున్సిపాలిటీలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యాచరణపై పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చి జరిపి యాత్రను విజయవంతం చేయాలని నందకిషోర్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా యాత్ర మున్సిపల్ కన్వీనర్ డా. మల్గారి వైభవ్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అనంత్ రెడ్డి, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.