8 August, 2026 | 8:58 PM

శ్రీ సాయి నగర్ నూతన కమిటీకి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు

08-08-2026 07:54 PM

బడంగ్ పేట్,(విజయక్రాంతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శనివారం ఆమె నివాసంలో జిల్లెలగూడ శ్రీ సాయి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కాలనీ అధ్యక్షులు బొక్క రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు చెప్పి అభినందించారు. నూతన కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చి, విన్నవించారు. 

ముఖ్యంగా కాలనీ మెయిన్ రోడ్డులోని డ్రైనేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జిహెచ్ఎంసి శంషాబాద్ జోనల్ కమిషనర్‌తో మాట్లాడి, శ్రీ సాయి నగర్ లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు జి.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జె.జంగయ్య యాదవ్, ఉప కార్యదర్శి డి.శ్రీనివాసరావు, కోశాధికారి వి.విశ్వేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు చంద్రమౌళి, ఆర్.కే.స్వామి, డి.అనిల్ గౌడ్, ఓ.శ్రీను మరియు సలహాదారులు సి.హెచ్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.