వాసు.. మంగ.. బలమైన ప్రేమకథ!
దర్శకుడు అజయ్ భూపతి ఓ బలమైన ప్రేమథతో రూపొందిస్తున్న తాజాచిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. మోహన్‌బాబు ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నారు.
టీమ్ తాజాగా ఈ చిత్రం టీజర్‌ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు చేతుల మీదుగా లాంచ్ చేయించింది. తిరుపతి దేవాలయ పట్టణంలో సాగే ఈ కథ వాసుబాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణాన్ని చూపిస్తుంది.
ఒకానొక సందర్భంలో మంగాను వదిలి వెళ్లలేని వాసుబాబు, తన ప్రేమ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతాడు. అజయ్ భూపతి ఈ చిత్రంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని యాక్షన్, భావోద్వేగా లతో మిళితం చేశారు. జయకృష్ణ, రాషా మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: జయకృష్ణ ఐఎస్‌సీ; ఎడిటర్: మాధవ్‌కుమార్ గుళ్ల పాటి; ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేశ్.






