16 April, 2026 | 4:01 AM

పసిడి వన్నె పూలతీగలా..

16-04-2026 02:22 AM

సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకుడు. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్ర నిర్మిస్తున్నారు. వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలిగీతం ‘ఓ సుందరి’ బుధవారం విడుదలైంది.

స్మరణ్ సాయి స్వరపర్చిన ఈ గీతానికి రెహ్మాన్ సాహిత్యం అందించగా, విజయ్ యేసుదాస్ ఆలపించారు. ‘పసిడి వన్నె పూలతీగలా.. అల్లుకుంది నన్నిలా.. తరానికే తరుణీమణి.. తరించనీ నయనాలనీ..’ అంటూ సాగుతోందీ పాట. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తిక్ పరమార్; ప్రొడక్షన్ డిజైన్: రోహన్ సింగ్.