24 June, 2026 | 2:44 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

వరుణ్‌తేజ్‌కు గాయం

16-04-2026 02:20 AM

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా వరుణ్ తేజ్ వాలీబాల్ ఆటను సాధన చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. శస్త్ర చికిత్స కూడా జరిగింది.

ఈ విషయాన్ని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘ప్రస్తుతం వరుణ్ అన్నయ్య వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భావిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.