అర్హులైన పేదలందరికీ ఇళ్లు
24-06-2026 02:37 PM
మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ
వాంకిడి, (విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ చేయిస్తామని కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ పేర్కొన్నారు. బుధవారం వాంకిడి మండలంలోని బంబార గ్రామానికి చెందిన బోయిరే సుజాత నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును స్థానిక సర్పంచ్ బెండరే కృష్ణాజీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే మంజూరీ చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడే సంతోష్, మాజీ ఉపసర్పంచ్ బోయిరే ప్రకాష్, పార్టీ నాయకులు, ఇందిరమ్మ రప్పిదారులు తదితరులు పాల్గొన్నారు.






