బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం
మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు
జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కార్యదర్శి బుద్ధర్తి బుచ్చయ్య
రామగిరి, (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శంకేశిపల్లె వద్ద నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ పనులను సర్పంచ్ కన్నూరి రవీందర్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి బుద్ధార్థి బుచ్చన్న పటేల్ కలిసి ప్రారంభోత్సవం చేశారు.
ప్రజలకు సౌకర్యవంతంగా
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శంకేశిపల్లెలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా గ్రామ ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా, ప్రజల రాకపోకలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. గ్రామాల్లో సంక్షేమం మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో బుధవారంపేట ఉపసర్పంచ్ బుద్ధార్థి విజయ, ఏఎంసీ డైరెక్టర్ ఆరేళ్లి శ్రీనివాస్, వార్డ్ సభ్యులు కన్నూరి రాకేష్, కన్నూరి శ్రావణ్, బావు స్వరూప కత్తెరసాల, మరుకు చంద్రశేఖర్, శీలం హర్షిత రాము, గ్రామ పంచాయతీ కార్యదర్శి చొప్పరి రాకేష్, కారోబార్ సతీష్, గ్రామస్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






