Congress vs BJP: ఆగని వందేమాతరం వివాదం
1937 వర్సెస్ 2026గా మారిన రాజకీయ రచ్చ
కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం
షర్మిలా ఠాగూర్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఫైర్
హిందూ-ముస్లిం మైండ్ సెట్ నుంచి బయటకు రండి
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ మధ్య (Congress vs BJP)వందేమాతరం వివాదం(Vande Mataram Row) రోజురోజుకు ముదురుతోంది. ఈ వివాదం ప్రస్తుతం 1937 వర్సెస్ 2026గా రాజకీయ రచ్చగా మారింది. 1937 నాటి తీర్మానానికే కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ను మరో ముస్లింలీగ్ గా బీజేపీ అభివర్ణించింది. దుర్గ, కాళీ వంటి ప్రస్తావనలపై ఓ వర్గానికి ఇబ్బంది ఉంటుందని షర్మిలా స్పష్టం చేశారు.
షర్మిలా ఠాగూర్(Sharmila Tagore) వ్యాఖ్యలపై ప్రముఖ సనీనటి, ఎంపీ కంగనా రనౌత్(MP Kangana Ranaut) ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ-ముస్లిం మైండ్ సెట్ నుంచి బయటకు రండి అంటూ కంగనా కౌంటర్ ఇచ్చారు. 1937లో తీర్మానం చేసినవారంతా దేశద్రోహులేనా? అంటూ ప్రయాంక్ ఖర్గే ప్రశ్నించారు. వందేమాతరం జాతీయ గీతంగా మార్చాలంటూ ముకేశ్ ఖన్నా డిమాండ్ చేశారు. అత్యవసరమైన జాతీయ అంశాల నుండి దృష్టిని మళ్లించే అనవసరమైన చర్చగా అభివర్ణిస్తూ, "వందేమాతరం"(Vande Mataram) వివాదానికి ముగింపు పలకాలని బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) అధినేత్రి మాయావతి శుక్రవారం నాడు రాజకీయ పార్టీలను కోరారు.






