రాయదుర్గం భూముల వేలంపై జోక్యానికి 'సుప్రీం' నిరాకరణ
భూముల వేలంపై ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకొండి
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
న్యూఢిల్లీ: రాయదుర్గం పాన్ మక్తా భూముల( Raidurgam Paan Makka lands) వేలంపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. భూముల వేలంపై ఏదైనా ఉంటే తెలంగాణ హైకోర్టులోనే(Telangana High Court) తేల్చుకోవాలని సీజేఐ ధర్మాసనం తేల్చిచెప్పింది. పాన్ మక్తా వద్ద సుమారు 11 ఎకరాల అమ్మకం కోసం టీజీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చింది. టీజీఐఐసీ ఒక్కో ఎకరాను రూ. 175 కోట్లు కనీస ధరగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భూముల వేలంపై(Auction of Telangana lands) సుప్రీంకోర్టలో జువ్వాడి ప్రణయ సింహారావు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపి టీజీఐఐసీ నోటిఫికేషన్(TGIIC Notification) లో జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది.
గతంలో కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని పిటిషనర్ తెలిపారు. నాడు రక్షించమని చెప్పిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని సూచించారు. పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు సూచించారు. కంచ గచ్చిబౌలి భూములకు ఇప్పుడు వేలం వేసే భూములకు సంబంధం లేదని సింఘ్వీ స్పష్టం చేశారు. ఇప్పుడు వేలం వేసే భూములు కంచ గచ్చిబౌలికి ఐదు కిలో మీటర్ల దూరం ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సీజేఐ ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటిషన్ తదుపరి విచారణకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది.






