గుర్రాలగొందిలో వనమహోత్సవం
అనంతరం గురుకుల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట రూరల్,ఆగస్టు 25: గుర్రాలగొంది గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్, స్పెషల్ ఆఫీసర్ రాజారాం, ఎంపీడీవో జగన్మోహన్‌రెడ్డి, ఎంపీవో మంజుల, పంచాయతీ కార్యదర్శి రామాదేవి, ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు టీ.రాజు, వై.రాజు తదితరులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
గురుకులంలో తనిఖీ
అనంతరం స్పెషల్ ఆఫీసర్ రాజారాం గుర్రాలగొంది గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు.






