25 August, 2026 | 4:29 PM

బీరంగూడ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

25-08-2026 04:03 PM

పటాన్ చెరు, ఆగస్టు 25(విజయక్రాంతి): దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. త్వరలోనే ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు కృషి చేస్తామని విజయ రామారావు తెలిపారు.