25 March, 2026 | 4:48 PM

వాలిడేషన్ బిల్లు రద్దు చేయాలి

25-03-2026 03:23 PM

- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ వినతి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ప్రవేశ పెట్టిన వాలిడేషన్ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసనలో భాగంగా బుధవారం బెల్లంపల్లిలో విశ్రాంతి ఉద్యోగులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ప్రవేశపెట్టిన వాలిడేషన్ బిల్ ను రద్దు చేయాలని  బెల్లంపల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బోడ రాజయ్య, సిహెచ్ శంకర్ నాయకత్వంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం అందచేశారు.

అంతరం వారు  మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగులకు తీరని నష్టం చేస్తున్నా వాలిడేషన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని బిల్లు ను నిలిపి వేయాలని కోరారు. ఈ బిల్లు వల్ల విశ్రాంతి ఉద్యోగులు జీవితాలు కకావికలం అవుతాయని ఆందోళనా వ్యక్తం చేశారు. ఈ బిల్లువిశ్రాంతి ఉద్యోగులు లకు పూర్తి వ్యతిరకమని విమర్శించారు. బిల్లు రద్దు చేయకపోతే తామిచేపట్ట బోయే ఆందోళలన కు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి శాఖ నాయకులు పాల్గొన్నారు.