11 May, 2026 | 4:02 AM

మోదీ సభలో పాల్గొన్న వైభవ్‌రెడ్డి దంపతులు

11-05-2026 12:24 AM

చేవెళ్ల, మే 10 (విజయక్రాంతి)  : నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన ‘జనాగ్రహ’ బహిరంగ సభకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీజేపీ యువ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, డాక్టర్ వ్యూహారెడ్డి దంపతులు ఈ సభలో పాల్గొని ఉత్సాహం నింపారు. ప్రధాని ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, వారు ‘జై భారత్.. జై మోడీ‘ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.