11 May, 2026 | 2:44 AM

చౌదర్‌పల్లి బయాన గుట్టలో చిరుత సంచారం

11-05-2026 12:23 AM

దేవరకద్ర, మే 10: దేవరకద్ర మండల పరిధిలోని చౌదర్పల్లి గుట్టలో చిరుత సంచరించిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామ సమీపంలోని భయాన గుట్టలో ఆదివారం సాయంత్రం ఓ చిరుత సంచరిస్తుండగా రైతులు గమనించారు. భయాన గుట్టపై చిరుతరైతులు గొర్ల కాపరులు పశువులు గొర్లను తీసుకుని వస్తుండగా గుట్టపై  కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రైతులు గొర్ల కాపరులు పశువులను తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు గుట్టపైనే చిరుత సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు గుట్టపై ఉన్న చిరుతను బంధించి తమ పశువులను గొర్రెలను కాపాడాలని గ్రామ రైతులు కోరుతున్నారు.