calender_icon.png 9 February, 2026 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్లకొండ జ్యోతి శ్రీనివాస్ నేత గెలుపు..

09-02-2026 01:52:31 AM

  1. వార్డు అభివృద్ధికి మలుపు

ఒకటవ వార్డు ప్రజలకు ఇచ్చిన హామీల అమలే లక్ష్యం

కోరుట్ల,ఫిబ్రవరి 8 (విజయక్రాంతి)స్వతంత్ర అభ్యర్థిగా బరిలో కుర్చీ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకి వెళ్ళి కోరారు.వడ్లకొండ జ్యోతి శ్రీనివాస్ నేత గెలుపు 1వ వార్డు అభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.నక్కలగుట్ట వద్ద వడ్డె ఓబన్న విగ్రహాన్ని తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని జ్యోతి శ్రీనివాస్ నేత ప్రకటించారు.

అదే ప్రాంతంలో ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో నిరక్షరాస్యులుగా మారి భిక్షాటనకు పాల్పడిన పిల్లలను చైల్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తూ, నక్కలగుట్టలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు అయ్యేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.వార్డులో రేషన్ షాప్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కృషి చేశానని, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. ఫించన్లు చాలా మందికి ఇప్పించానని, ఇప్పటికీ రాని అర్హులందరికీ తప్పకుండా వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

వికలాంగులకు సదరం సర్టిఫికెట్ లేని వారికి సర్టిఫికెట్ ఇప్పించి, వారికి పింఛన్లు వచ్చేలా చేశానని వెల్లడించారు.మహిళా సంఘాల కోసం కమిటీ హాల్కు స్థలం ఇప్పించి, భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని జ్యోతి శ్రీనివాస్ నేత తెలిపారు. కార్మికులకు లేబర్ కార్డులు ఇప్పించానని, మిగిలిన అర్హులకు కూడా కార్డులు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు.

బీడి కార్మికుల పెన్షన్, పీఎఫ్లో ఉన్న తప్పులను ప్రత్యేక ఆధార్ సెంటర్ ద్వారా సరిదిద్దుతానని చెప్పారు.సి.సి. రోడ్ల వల్ల కొన్ని ఇండ్లు క్రిందికి వెళ్లి వర్షపు నీరు ఇంట్లోకి వస్తున్న సమస్యను మున్సిపల్ అనుమతులతో శాశ్వతంగా పరిష్కరిస్తానని తెలిపారు. పెండింగ్లో ఉన్న సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయించి నిర్మాణాలు పూర్తి చేయిస్తానని అన్నారు.ఇళ్ల పట్టాలు రాని వారికి పట్టాలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించేలా కృషి చేస్తానని జ్యోతి శ్రీనివాస్ నేత తెలిపారు.

వార్డులో తాగునీటి సమస్య లేకుండా చూడటంతో పాటు, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానన్నారు. కేంద్రం నుంచి వచ్చే ‘వార్డు నిధులు’ మంజూరు చేయించి పూర్తిగా వార్డు అభివృద్ధికే వినియోగిస్తానని పేర్కొన్నారు.పేద వృద్ధులు మృతి చెందితే తన వంతు సహాయంగా రూ.5,000 అందిస్తానని తెలిపారు. అలాగే వార్డులోని ఆడపిల్ల పెళ్లికి తన తోబుట్టువుగా కట్నం కింద రూ.10,016 అందజేస్తానని ప్రకటించారు. .