2 March, 2026 | 1:54 AM

ప్రత్యేక గ్లింప్స్‌తో ఉస్తాద్ విందు

28-02-2026 12:00 AM

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశిఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో పార్థిబన్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. మార్చి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ సినీప్రియుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానులను ఆనందోత్సాహానికి గురిచేసింది.

ఈ పోస్టర్‌లో పవన్.. హ్యాట్ ధరించి స్టుటైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ త్వరలోనే చిత్రా నికి సంబంధించి 40 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రత్యేక వీడియో ద్వారా చిత్రంలోని స్థాయి, తీవ్రత, మాస్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ గ్లింప్స్ అభిమానులకు అసలు సిసలైన మాస్ విందును అందించనుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్; ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ; కూర్పు: కార్తిక శ్రీనివాస్; కళ: ఆనంద్ సాయి.