భయపెడుతూ నవ్వించే రుక్మిణి
నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరోహీరోయిన్లుగా జీ సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా గంగాధరరావు నిర్మిస్తున్న చిత్రం ‘రుక్మిణి’. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతుండగా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా, తరుణ్ రావుల డీవోపీగా పనిచేస్తున్నారు.
ఈ మూవీ టీజర్‌ను హీరో మంచు మనోజ్ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ.. “రుక్మిణి’ టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్.. అన్నీ చాలా బాగున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అన్నారు.
‘డిఫరెంట్ హారర్ కామెడీ మూవీగా రుక్మిణి అందరినీ ఆకట్టుకుంటుంద’ని చిత్ర కథానాయకుడు నిరంజన్ చెప్పారు. ‘మేమంతా ఎంతో ప్యాషనేట్‌గా చేస్తున్న చిత్రమిది. అందరి సపోర్ట్ ఉండాల’ని హీరోయిన్ గ్రీష్మ నేత్రికా తెలిపింది. వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రుక్మిణి చిత్రం తీసుకొస్తామని మరో హీరోయిన్ ప్రియ జాస్పర్ చెప్పింది. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సింహాచలం, నిర్మాత గంగాధర్‌రావు, నటులు విఖ్యాత్, జయంత్, మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ కూడా మాట్లాడారు.




