25 April, 2026 | 4:31 AM

ఇరాన్‌తో చర్చలకు అమెరికా రాయబారులు

25-04-2026 02:18 AM

చర్చలు సఫలమైతే పాకిస్తాన్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్?

వాషింగ్టన్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాకిస్థాన్‌కు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వీరు జరిపే చర్చలు పురోగతి సాధిస్తే అప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇరాన్ మంత్రి అరాగ్చీ పాక్ వెళ్లనున్నారని ఇప్పటికే అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పర్యటనకు ముందే పాక్ డిప్యూటీ పీఎం, విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఆయన ఫోన్‌లో సంభాషించారు. కాల్పుల విరమణతోపాటు పలు అంశాలపై ముగ్గురితో అరాగ్చీ చర్చించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.