22 April, 2026 | 1:59 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!

08-04-2026 03:36 PM

న్యూఢిల్లీ:  పశ్చిమ ఆసియా సంక్షోభంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులు(Indians) ఇరాన్ నుండి త్వరితగతిన నిష్క్రమించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహా జారీ చేసింది. రాయబార కార్యాలయం భారత పౌరులకు అత్యవసర సూచన చేసింది. ఎంబసీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా రావాలని వెల్లడించింది. భారత ఎంబసీని(Embassy of India) సంప్రదించకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఎంబసీ హెల్స్ లైన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీని భారత్ అందుబాటులోకి తెచ్చింది. భారతీయ పౌరులు అధికారిక తాజా సమాచారాన్ని నిశితంగా గమనించాలని అధికారులు సూచించారు. 

రాయబార కార్యాలయం మొబైల్ నంబర్లు: +989128109115, +989128109109, +989128109102, +989932179359

రాయబార కార్యాలయ ఈమెయిల్: cons.tehran@mea.gov.in