06-02-2026 01:25:38 AM
వనపర్తిలోని 19వ వార్డులో పాట్య తిరుపతయ్య ప్రచారం
ఆపిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 19వ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పాట్య తిరుపతయ్య ప్రచారానికి అపూర్వ స్పందన వచ్చింది. గురువారం 19వ వార్డు లో ఆయన జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాట్య తిరుపతయ్య మాట్లాడుతూ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, వార్డు మ్యానిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చే నాయకుడిని కాదని అనునిత్యం అందుబాటులో ఉన్న మీ బిడ్డ అయిన నన్ను ఆశీర్వదించాలని, ఆపిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ అందించి గెలిపించాలని తిరుపతయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సుగూర్ మౌలాలి యాదవ్, రాజేష్, రాజశేఖర్ పాల్గొన్నారు.