22 August, 2026 | 4:21 AM

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

22-08-2026 01:21 AM

యాదగిరిగుట్టలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు

యాదగిరిగుట్ట, ఆగస్టు 21 (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శ్రీ స్వామి వారి ఆలయంలో శుక్రవా రం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సా యంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై న యాదగిరిగుట్ట  ప్రధానాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతంను ఘనంగా నిర్వహించారు. కొండకింద  సత్యనారాయణస్వామి వ్రత మండపం హాలు నెంబర్ రెండులో ఉదయం 11 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. నిత్య రాబడి  రూ.13,22,293 వచ్చినట్లు అధికారులు తెలిపారు.