24 June, 2026 | 2:31 AM

కేంద్రమంత్రి కురియన్ రాజీనామా

24-06-2026 12:21 AM

ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, జూన్ 23: కేంద్రమంత్రివర్గంలో ఏకైక మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినట్లు మంగళవారం రాష్ట్రపతి భవన్ వర్గాలు ధృవీకరించాయి. 65 ఏళ్ల కురియన్, మోదీ ప్రభుత్వ మూడో పర్యాయంలో మైనార్టీ వ్యవహారాల శాఖతోపాటు మత్స్య, పాడి, పశుపోషణ శాఖల సహాయమంత్రి హోదాలో కొనసాగారు.

ఆగస్టు 2024 మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. జూన్ 21తో రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. బీజేపీ తిరిగి రాజ్యసభకు కురియన్‌ను నామినేట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూను కూడా బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. కురియన్ కేరళలోని సీనియర్ బీజేపీ నాయకులలో ఒకరు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పేలవమైన పనితీరే ఆయనకు అవకాశం దక్కకపోవడానికి కారణమని భావిస్తున్నారు.