13 April, 2026 | 5:06 PM

రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

13-04-2026 03:33 PM

రేవంత్ రెడ్డికి అవగాహన లేదు

మేమే దక్షిణాదిలోనే ఉన్నాం.. అన్యాయం జరగనివ్వం

డీలిమిటేషన్ కు రెండేళ్లు,

ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డికే వదిలేస్తున్నా

హైదరాబాద్: డీలిమిటేషన్(Delimitation)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని తెలిపారు. డీలిమిటేషన్ తో దక్షిణది రాష్ట్రాలకు అన్యాయం జరగలేదని కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. మేము దక్షిణాదిలోనే ఉన్నాం.. అన్యాయం జరగనివ్వమని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరుగుతోందని చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియకు రెండేళ్ల సమయం పడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్లను(Women's Reservations) రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీని కిషన్ రెడ్డి కోరారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రేవంత్ రెడ్డినే వదిలేస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.