కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్— ఎందుకంటే?
13-04-2026 03:18 PM
హైదరాబాద్: అంగన్‌వాడీ కార్యకర్తల కోసం మొబైల్ ఫోన్ల కొనుగోలుకు సంబంధించి చేసిన నిరాధార ఆరోపణలపై తెలంగాణ మంత్రి సీతక్క(Minister Seethakka) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసు పంపారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) చేపట్టినదానిని ఆమె తప్పుడు సమాచార ప్రచారంగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆరే బాధ్యత వహించాలని తెలిపారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ బేషరతు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని మంత్రి సీతక్క హెచ్చరించారు.




