17-02-2026 03:53:30 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లా హాలియాలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ ఎడమ కాలువ బ్రిడ్జిపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైకు ను లారీ ఢీకొట్టడంతో వెంకటయ్య(55), మల్లమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెద్దపూర మండలం కొత్తగూడెం వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.