13-02-2026 12:00:00 AM
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 12: గంజాయి రవాణా, విక్రయాన్ని అరికట్టడానికి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ లో టూటౌన్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా, గుండ్ల చెరువు సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా, వారి వద్ద గంజాయి లభించింది. నిందితులు కోడూరు సురేష్, ఆగుల్ల ఎల్లేష్ ను అదుపులోకి తీసుకొని వారి నుంచి 26 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగాఉండాలనిహితవు పలికారు.