calender_icon.png 13 February, 2026 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెటర్నరీ కళాశాల తరలింపుపై ఆగ్రహ జ్వాలలు

13-02-2026 12:00:00 AM

విద్యార్థుల భవిష్యత్తు కోసం హరీష్ రావు మరో వినూత్న కార్యక్రమం

సిద్దిపేట రూరల్ ఫిబ్రవరి 12: సిద్దిపేటను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుదేనని విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. అర్బన్ మండలం తడకపల్లి జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు రెడ్డి యాదగిరి, నియోజకవర్గ అధ్యక్షుడు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా హరీష్ రావు స్వంత ఖర్చుతో విద్యార్థుల మేధస్సు పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గంలోని 2800 మంది విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన డిజిటల్ కంటెంట్ బుక్స్ అందజేస్తున్నారని వెల్లడించారు. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు ఇంట్లో డిజిటల్ స్టడీ చేసే అవకాశం కల్పించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించారని చెప్పారు.సిద్దిపేటకు మంజూరైన రూ.300 కోట్ల వెటర్నరీ కళాశాలను ఇతర ప్రాంతానికి తరలించడం సిద్ది పేటపై కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.

అభివృద్ధి పేరుతో ఇతర ప్రాంతాలకు అవకాశాలు కల్పించుకోవడం సమంజసం కాని, ఇప్పటికే సగం పనులు పూర్తున కళాశాలను తరలించడం ప్రజలను నిరాశకు గురి చేసిందని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, చిన్నకోడూర్ మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, సందీప్, చందు గౌడ్, భానుచందర్, ఆనంద్, రామరాజు, సంపంగి శ్రీకాంత్, గొట్టం అమర్, గణపురం సాయి తదితరులు పాల్గొన్నారు.