16 August, 2026 | 4:54 PM

టియుడబ్ల్యూజెహెచ్ యూనియన్ సభ్యత్వ నమోదు

16-08-2026 03:46 PM

చందుర్తి, ఆగష్టు 16,(విజయక్రాంతి): మండల కేంద్రంలో టీయుడబ్ల్యూజెహెచ్ 143 ఆధ్వర్యంలో జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల తిరుమల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీయుడబ్ల్యూజెహెచ్ జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం టియుడబ్ల్యూజెహెచ్ అహర్నిశలు కృషి చేస్తుందని. అలాగే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల జారీపై ఇప్పటికే యూనియన్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించిందని భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్ట్ లు లింగాల లింగయ్య. గొట్టె మనోహర్, రాజూరి విష్ణు,ఏనుగుల కృష్ణ, మ్యాకల కొమురయ్య, మేడిశెట్టి మధు, గొట్టె మనోహర్ రాజూరి సద్గుణచారి, కొడగంటి గంగాధర్, రాజూరి రఘురాం,పాల్గొన్నారు.