20 June, 2026 | 9:12 PM

లోక్ అదాలత్ రాజీమార్గంలో ఇద్దరు గెలుస్తారు

20-06-2026 07:58 PM

తుంగతుర్తి కోర్టు ఇన్చార్జి జడ్జి  మంచాల మమత

తుంగతుర్తి,(విజయక్రాంతి): కోర్టు కేసులో ఒక్క గెలుస్తారని ,లోక్ అదాలత్ లో‌ రాజీ మార్గంలో ఇద్దరు గెలుస్తారని సివిల్ కోర్టు ఇన్చార్జి మంచాల మమతా అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కక్షిదారులకు సమయం ధనం వ్రుదా‌‌ కాకుండ కేసుల పరిష్కారం చేయడం వారికి‌ ఎంతో లాభదాయకం అని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం ఆర్టికల్ 39ఎ ప్రకారం పేదలకు ఉచితంగా న్యాయం సహాయం చేయాలని రాజ్యాంగం చెబుతోందని చెప్పారు. అందులో భాగంగానే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జ్ఞాన సుందర్  జనరల్ సెక్రటరీ కె వెంకటేశ్వర్లు, ‌నాగారం సిఐ తుంగతుర్తి సిఐ ఆరు పోలీసు స్టేషన్ల ఎస్ఐ లు జాయింట్ సెక్రటరీ ఎంమ్ రవి కుమార్ సీనియర్ న్యాయవాది టి సత్యనారాయణ ,‌కోశాధి‌కారి‌బి సతిష్ ‌గేమ్స్ సెక్రటరీ ‌బి.ప్రతాప్ కార్యవర్గ సభ్యులు వేణురాజ్, ఓర్సు రాజు ‌తదితరులు‌పాల్గోన్నారు.